: అవసరమైతే రాష్ట్రపతి పాలన: కేంద్రం


ఏపీఎన్జీవోల సమ్మెపై నేడు రాష్ట్ర హైకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. తమ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించామని రాష్ట ప్రభుత్వం చెప్పగా, గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని కేంద్రం పేర్కొంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధిస్తామని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం విఫలమైతే కేంద్రం రంగంలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News