: 'న్యూస్ కార్పొరేషన్' లో తెలుగుతేజం


ప్రముఖ అంతర్జాతీయ వార్తా చానళ్ల సంస్థ 'న్యూస్ కార్పొరేషన్' కు ఉపాధ్యక్షుడిగా తెలుగు తేజం నరిశెట్టి రాజు నియమితులయ్యారు. రాజు ప్రస్తుతం అమెరికాలో 'న్యూస్ కార్పొరేషన్' అనుబంధ విభాగమైన సుప్రసిద్ధ వాల్ స్ట్రీట్ జర్నల్ కు డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తాజాగా ఏర్పాటు చేసిన 'వ్యూహరచన-ప్రణాళిక' విభాగానికి రాజును ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు న్యూస్ కార్పొరేషన్ యాజమాన్యం ప్రకటించింది. జర్నలిజం విద్యార్థిగా 1991 లో వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఇంటర్న్ షిప్ చేసిన రాజు అదే సంస్థలో ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదని ప్రవాసాంధ్రులు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News