: నేడు అమెరికా వెళుతున్న సోనియా గాంధీ


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం ఈ రోజు సాయంత్రం అమెరికా వెళుతున్నారు. ఆమె అమెరికా వెళ్ళే అవకాశం ఉందని వార్తలొచ్చిన నేపథ్యంలో విలేకరులు వివరణ కోరగా సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఈ విషయం తెలియజేసారు. వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళాల్సి ఉందని చెప్పారు. 2011 ఆగస్టు లో అమెరికాలో కేన్సర్ సర్జరీ చేయించుకున్న సోనియా గతేడాది ఫిబ్రవరి, సెప్టెంబర్ లలో కూడా పరీక్షల కోసం అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News