: భారత్ - ఆస్ర్టేలియా పోరుకు టికెట్ బుక్ చేసుకోండి..
రెండు పటిష్ఠ జట్ల మధ్య టెస్టు మ్యాచూ రంజుగానే ఉంటుంది. చూడడానికి మాంచి మజాగా ఉంటుంది. అదీ ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభిస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు! సరిగ్గా రాష్ట్ర ప్రజలకు అలాంటి అవకాశమే వచ్చేసింది.
భారత్, ఆస్ర్టేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మార్చి 2 నుంచీ ప్రారంభం అవుతోంది. వేదిక హైదరాబాదు లోని ఉప్పల్ స్టేడియం. ఈ క్రికెట్ సమరాన్ని చూడాలనుకుంటే టికెట్లు బుక్ చేసుకోవాలి మరి. నేటి నుంచి అమ్మకాలు మొదలవుతున్నాయి. ధరలు రూ. 100, 300, 500, 750, 3000. www.bookmyshow.com వెబ్ సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాదు లోని 36 ఈ సేవా కేంద్రాలలో టికెట్లను కొనుగోలు చేయవచ్చని హైదరాబాదు క్రికెట్ సంఘం తెలియజేసింది.