: విభజన జరిగితే నీటి యుద్ధాలే: సీఎం
రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి సాగు నీరు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన అనంతపురం జిల్లా రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తనకు స్వార్థం లేదని విభజన వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికే విభజన వద్దంటున్నానని ఆయన స్పష్టం చేశారు.