: పోలీసు యూనిఫాంలో జైలు గోడలుదూకి తప్పించుకున్న ఖైదీ


రెండు సంవత్సరాలుగా జైలులో ఉంటున్న ఓ ఖైదీ పోలీసుల కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. అదీ పోలీసు యూనిఫాంలో పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో ఉన్న సెంట్రల్ జైల్లో జరిగింది. రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటనకు బాధ్యులుగా పదకొండు మంది జైలు అధికారులు సస్పెండ్ అయ్యారు. 2011 నుంచి జైశంకర్ (36) అనే వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడు. అత్యాచారం, మర్డర్, కిడ్నాప్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 కేసుల్లో విచారణలు ఉన్నాయి.

దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. జైలు బయట ఉన్న 30 అడుగుల వెలుపలి గోడను దూకినట్లు తెలిపారు. ఈ గోడలకు విద్యుత్ సరఫరాను భారీవర్షాల కారణంగా కొన్ని రోజుల కిందట తీసివేశామని అయినా జైశంకర్ మేనేజ్ చేశాడని పోలీసులు తెలిపారు. అతనికి మానసిక సమస్యలు ఉండటంతో జైల్లోని అండర్ గ్రౌండ్ సెల్ లో భారీ భద్రతతో ఉంచామన్నారు.

అయితే, కొన్ని రకాల వస్తువులతో సెల్ ను తెరిచి అక్కడి నుంచి పోల్ సాయంతో 20 అడుగులు గోడను దూకాడని చెప్పారు. గోడకు గాజు పెంకులు ఉండటంతో ఖైదీ గాయపడినట్లు తెలుస్తోందని ఎందుకంటే అతని రక్తం గోడకు అంటుకుందన్నారు. జైలు నుంచి బయట గోడ దూకేందుకు బెడ్ షీట్ ను నడుంకు బెల్ట్ గా మార్చుకున్నాడని మరో పోలీసు అధికారి జ్ఞానదీప్ వెల్లడించారు. ఘటనపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News