: నాది ప్రజా టర్న్: చంద్రబాబు


కాంగ్రెస్ లో కలిసిపోయిన టీఆర్ఎస్.. యూటర్న్ తీసుకున్నానని తనపై ఆరోపణలు చేస్తోందని, అయితే తాను సీ టర్నో, లేక యూ టర్నో తీసుకోలేదని, తాను తీసుకున్నది ప్రజా టర్న్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం చేశారు. బాబ్లీ కోసం ఎన్నడూ జైలు ముఖం చూడని తాను జైలుకు వెళ్లానని తెలిపారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేసే వరకు తన పోరాటం ఆగదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News