: విశాఖను రాజధాని చేయాలి: కొండ్రు మురళి
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే విశాఖను రాజధాని చేయాలని మంత్రి కొండ్రు మురళి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కొంత మంది కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లో కర్చీఫ్ లు వేసి పార్టీకి ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన జరిగితే రాష్ట్రంలో అన్ని అర్హతలున్న విశాఖను రాజధాని చేయాలని లేదా ఉత్తరాంధ్రను తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.