: సందీప్ దీక్షిత్ పై ఫిర్యాదు చేస్తాం: ఎంపీ నామా
పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పార్లమెంటులో ఇందిరాగాంధీ మాస్క్ ధరించి నిరసనకు దిగిన ఎంపీ శివప్రసాద్ పై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో ఎలా తిరుగుతావో చూస్తానని దుర్భాషలాడుతూ బెదరింపులకు పాల్పడ్డాడని అన్నారు. తెలుగుజాతిని అవమానపరిచే విధంగా సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేశాడని, తెలుగువారంటే కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి చులకన భావం ఉందని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ దీక్షిత్ దూషణలపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని నామా స్పష్టం చేశారు.