: రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి న్యాయం చేస్తాం: సూర్యప్రకాష్ రెడ్డి
రైల్వే బడ్జెట్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. 12 గంటలకు రైల్వేమంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే ఛార్జీలు పెంచే అవకాశం ఉందని మంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక విశాఖ రైల్వే డివిజన్ ను దక్షిణ మధ్య రైల్వేలో కలిపే అంశంపై కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.