: ఏపీఎన్జీవోల సమ్మెపై నివేదిక తెప్పించుకుంటాం: హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ఏపీ ఎన్జీవోల సమ్మెపై చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సమ్మెపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని కోర్టుకు తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా సమ్మె విషయంలో చర్యలు తీసుకుంటామని కోర్టులో వాదనల సమయంలో స్పష్టం చేసింది. అయితే, గతంలో టీఎన్జీవోల సమ్మె విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపిన ఏపీ ఎన్జీవోల తరపు న్యాయవాది ఇప్పుడెందుకు చర్యలు తీసుకుంటున్నారని అడిగారు.