: ఇందిరమ్మ మాస్క్ ధరించిన శివప్రసాద్.. దూషించిన కాంగ్రెస్ ఎంపీ


సమైక్యాంధ్ర కోసం వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడంలో టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ రూటే వేరు. శ్రీకృష్ణుడి వేషం వేసుకుని సభకు హాజరుకావడం, పార్లమెంటు ప్రాంగణంలో కొరడాతో కొట్టుకోవడం వంటి చర్యలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన తాజాగా ఇందిరమ్మ మాస్క్ ధరించి సభకు వచ్చారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభలో సస్పెన్షన్ కు గురైన అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, సందీప్ దీక్షిత్.. శివప్రసాద్ ను దూషించారని ఆరోపించారు. తూర్పు ఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్.. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు.

  • Loading...

More Telugu News