: 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటే సభ నుంచి సస్పెండ్ చేశారు!
సమైక్యాంధ్ర నినాదాలతో ఎలుగెత్తడంతో టీడీపీ ఎంపీలు లోక్ సభలో సస్పెన్షన్ కు గురికాగా, రాజ్యసభలోనూ అదే సన్నివేశం కనిపించింది. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ నినదించడంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. కాగా, లోక్ సభలో సస్పెన్షన్ కు గురైన కొనకళ్ళ, మోదుగుల, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ లు సభలోనే బైఠాయించి తమ నిరసన తెలిపారు.