: నేడు గవర్నర్ ను కలిసి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం: గంటా
విభజన ప్రకటనకు వ్యతిరేకంగా చేసిన రాజీనామాలపై నేడు తొలుత ముఖ్యమంత్రిని కలుస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అనంతరం రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నట్లు చెప్పారు. విభజన ప్రకటన వస్తే రాజీనామాలు చేస్తామని ముందే చెప్పామన్నారు. అయితే, కాంగ్రెస్ ను వీడేదిలేదని గంటా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే తెలంగాణపై శాసనసభలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత నెల గంటాతో పాటు మంత్రులు విశ్వరూప్, ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.