: బాబు యాత్రపై హరీష్ రావు విసుర్లు


టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'తెలుగుజాతి ఆత్మగౌరవం' పేరుతో బాబు బస్సు యాత్ర చేయడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని మండిపడ్డారు. రాజకీయాల కోసం విలువలు దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. ఒకప్పుడు తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చిన బాబు ఎన్నిసార్లు మాట మారుస్తారని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గదన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ ఎప్పుడో అదృశ్యమైందన్న హరీష్ రావు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అన్నారు.

  • Loading...

More Telugu News