: నేడు రాజ్యసభ ముందుకు ఆహార భద్రత, భూసేకరణ బిల్లులు


జాతీయ ఆహార భద్రత, భూసేకరణ బిల్లులు నేడు రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే పలు సవరణలు, సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లులు లోక్ సభలో ఆమోదం పొందాయి. ఈ క్రమంలో పెద్దల సభలోనూ చర్చ జరగనుంది. అయితే, ఆహార భద్రత బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలని సీపీఐ భావిస్తోంది. అటు లోక్ సభ ముందుకు సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు కూడా రానుంది. రాజకీయ పార్టీలు ఈ చట్టం పరిధిలోకి రాకుండా బిల్లులో సవరణలు చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News