: ఆసీస్ 241 ఆలౌట్.. భారత్ లక్ష్యం 50 పరుగులు
చెన్నయ్ టెస్టులో భారత్ గెలుపు వాకిట నిలిచింది. రెండో ఇన్నింగ్స్ల్ లో 241 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 50 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లను విసిగించిన చివరి వికెట్ భాగస్వామ్యం ఎట్టకేలకు వీడింది.
ఈ రోజు తొలి సెషన్ లో లియాన్ (11) ను జడేజా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. మరోవైపు కొరకరాని కొయ్యలా మారిన హెన్రిక్స్ (81 నాటౌట్) అజేయంగా నిలిచాడు.