: చీకట్లో నరవాసన పసిగట్టేస్తుంది


మనకు ప్రతిరోజూ ఒక సందేహం వస్తుంటుంది. ఇల్లంతా ఇంత చీకటిగా ఖాళీగా ఉండగా, ఈ దిక్కుమాలిన దోమ నేరుగా నా కాళ్లమీదనే వాలి కుట్టి చంపేస్తోందేంటబ్బా.. ఆ టీవీ మీదనో గోడమీదనో వాలి చావొచ్చు గదా అనిపిస్తుంది. అయితే విషయం ఏంటంటే.. మలేరియాకు కారణమయ్యే దోమలకు రాత్రి వేళల్లో మనుషుల వాసన బాగా తెలిసిపోతుందిట. చీకటి పడిన తర్వాత అవి మనుషుల్ని ఎక్కువగా కుడుతుంటాయని ఓ అధ్యయనం తేల్చింది.

దక్షిణాఫ్రికాలో ఈ విషయంపై ఓ అధ్యయనం నిర్వహించారు. అనోఫిలస్‌ దోమల యాంటెన్నాలు, నోటిచుట్టూ వాసనను పసిగట్టగల పరమాణువులు రాత్రివేళల్లో చాలా చిక్కగా ఉన్నట్లు గుర్తించారు. దోమల బెడత తప్పాలంటే.. చీకటి పడేవేళకు జాగ్రత్తలు మొదలు కావాలని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News