: ఆ దీపం మన స్నానాన్ని గమనిస్తుంటుంది!


మనం ఎంత సేపు స్నానం చేస్తున్నాం... షవర్‌ చేస్తున్న ఆదమరపులో అతి ఎక్కువ సేపు జలకమాడుతూ బాహ్యప్రపంచాన్ని మరచిపోతున్నామా? అనే విషయాలను అది పరిశీలిస్తూ ఉంటుంది. ఆ మేరకు అది మనల్ని హెచ్చరించడానికి కూడా ప్రయత్నిస్తుంటుంది. అలాంటి హెచ్చరిక దీపం పొదిగిన షవర్‌ హెడ్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఒకసారి షవర్‌ ఆన్‌ చేసిన తర్వాత.. ఒళ్లు తెలియకుండా సమయం మరచిపోయి.. అలా గంటల తరబడి దానికిందనే సేదతీరుతూ ఉండిపోతే ఆ షవర్‌ హెడ్‌కు అమర్చిన బల్బుకు కోపం వచ్చేస్తుంది. ఎర్రగా వెలగడం ప్రారంభిస్తుంది. షవర్‌ ఆరంభించినప్పుడు ఆకుపచ్చగా వెలిగేది కాస్తా.. టైం మీరిపోయే కొద్ది ఎర్రగా మారుతుంది. దాని హెచ్చరికను గమనించి షవర్‌ కట్టేయాలన్నమాట. అయితే ఈ షవర్‌హెడ్‌కు ముందే ఎంత సేపటికి ఎర్రగా మారాలో టైంను మనమే ఫిక్స్‌ చేయవచ్చట.

నీటి వృథాను అరికట్టడానికి ఉద్దేశించిన ఈ పొదుపు మంత్రం బాగానే ఉంది కదూ!!

  • Loading...

More Telugu News