: రేపు లోక్ సభ ముందుకు సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు
సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు సోమవారం లోక్ సభ ముందుకు రానుంది. రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాకుండా బిల్లులో సవరణలు చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రక్తం మరిగిన పులుల్లాంటి రాజకీయ నాయకులను తప్పించే సమాచార హక్కు చట్టం వల్ల ప్రజలకే తప్ప నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదని, అలాంటి బిల్లు ప్రవేశపెట్టి ఉపయోగం ఏంటని, అది కూడా ప్రజలను వేధించడానికే ఉపయోగపడుతుందని మండిపడుతున్నారు.