: వన్డే ర్యాంకింగులో 'నెంబర్ వన్'గా కొనసాగుతున్న భారత్


వన్డే క్రికెట్ ర్యాంకులలో భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 119 పాయింట్లతో ఇండియా టీమ్ నెంబర్ వన్ స్థానంలో వుండగా, 117 పాయింట్లతో ఇంగ్లాండు రెండో స్థానంలో నిలిచింది. 116 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 112 పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో వున్నాయి. ఐసీసీ వన్డే చాంపియన్ షిప్ టేబుల్ కు గడువు వచ్చే ఏప్రిల్ నెలతో ముగుస్తోంది.         

  • Loading...

More Telugu News