: రూపాయి సెగతో తగ్గిన మహీంద్రా కార్ల అమ్మకాలు
రూపాయి సెగ అన్ని రంగాలకు తగులుతోంది. దారుణంగా కరెన్సీ రేటు పడిపోవడంతో దాని ఫలితం అన్ని రంగాలపై పడి, ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు పెరగకపోయినా ప్రజలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడిపోతున్నారు. దీంతో కార్ల వంటివి అమ్ముడు కావడం లేదు. ఆగస్టు నెలలో తమ కార్ల అమ్మకాలలో 17.32 శాతం క్షీణత నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో 45,836 కార్లను అమ్మిన ఈ సంస్థ, ఈ ఏడాది మాత్రం 37,897 కార్లను మాత్రమే అమ్మినట్టు తెలిపింది. పాసింజర్ వాహనాల్లోనే కాక, కమర్షియల్ వాహనాల అమ్మకాల్లోనూ క్షీణతే నమోదైందని, మొత్తంగా ఆటో రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితే దీనికి కారణమని ఆ సంస్థ తెలిపింది.