: యూఎస్ ఓపెన్ లో భారత క్రీడాకారుల ముందంజ
యూఎస్ ఓపెన్ లో భాగంగా శనివారం జరిగిన పలు మ్యాచుల్లో భారత టెన్నిస్ క్రీడాకారులంతా విజయం సాధించారు. సానియా, పేస్, బోపన్న, దిజు లు డబుల్స్ విభాగంలో ముందంజ వేశారు. చైనా క్రీడాకారిణితో కలిసి ఆడిన సానియా హంగేరియన్ కాటాలిన్ మారోసి, యూఎన్ఏ మేగన్ మౌల్టన్ జోడిపై విజయం సాధించింది. చైనీస్ తైపీ భాగస్వామితో జతకట్టిన దిజు.. ఇజ్రాయెల్ జోడి జోనాధన్ ఈరీచ్, ఆండీ రామ్ పై విజయం సాధించారు. లియాండర్ పేస్ జోడి డానియల్ బ్రాండ్స్, ఫిలిప్ అన్ వాల్డ్ జోడిపై రోహన్ బోపన్న జోడి నికోలాయ్ డెవిడెంకో, మికాలి ఎల్జిన్ జోడి పై విజయం సాధించారు.