: ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న నెల్సన్ మండేలా
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా రెండు నెలల చికిత్స అనంతరం ఈ రోజు స్వగృహానికి చేరుకున్నారు. 95 ఏళ్ల ఆయన మొన్నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జయినట్టు వార్తలు వెలువడినప్పటికీ అవన్నీ పుకార్లని ఆ దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నిలకడ తప్పుతోందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్ల బృందం ఇంటివద్ద కూడా అదే స్థాయిలో మెరుగైన వైద్యాన్ని కొనసాగిస్తుందని ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.