: రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలన్నది చూడాలి: టీడీపీ నాయకుడు సీఎం రమేష్


రాహుల్ ను ప్రధానిని చేసేందుకు, జగన్ సీఎం ను చేసేందుకే కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు నాటకాలాడుతున్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతికి జరిగిన అన్యాయాన్ని అడ్డుకునే శక్తి ఒక్క టీడీపీకే ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతాడని భయపడే కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. బహిరంగ లేఖల పేరిట నాటకాలేంటని ఆయన విజయమ్మను ప్రశ్నించారు. వైఎస్ చావుకు కారణం సోనియా అని ఆరోపించే వైఎస్సార్ సీపీ... కాంగ్రెస్ పార్టీకి కానీ, సోనియా, రాహుల్ కు కానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య అయినా చేయగలిగే దమ్ముందా? అని సవాలు విసిరారు. నాటకాలు కట్టిపెట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో సాయపడండని వైఎస్సార్సీపీకి ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News