: ప్రారంభమైన చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర'
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లా పొందుగులలో ప్రారంభమైంది. తొలి రోజు యాత్రలో చంద్రబాబు నాయుడు 35 కిలోమీటర్లు పర్యటించనున్నారు. రాష్ట్ర విభజనపై చోటుచేసుకున్న రాజకీయాలను చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించేందుకు సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఈ యాత్రను చేపట్టారు. పొందుగులలో ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.