: ఏం చేద్దాం... సీఎంతో సీమాంధ్ర నేతల సమావేశం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు ఉన్నారు. సీమాంధ్రలో ఎగసిపడుతున్న ఉద్యమం, ప్రతిపక్షాలు అనుసరిస్తున్న విధానాలపై వీరు తీవ్రంగా చర్చించినట్టు సమాచారం. మరో వైపు మంత్రులు గంటా, మరో ఇద్దరి రాజీనామాల వ్యవహారంపై కూడా చర్చించారు. దీంతో మరోసారి ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం ముందు తమ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే వారు ఎప్పుడు ఢిల్లీ వెళ్తారనే దానిపై స్పష్టత లభించలేదు.

  • Loading...

More Telugu News