: ఎన్డీయే బలమైన ఆర్ధిక వ్యవస్థను యూపీఏకు అప్పగించింది: వెంకయ్య
ఎన్జీయే ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి బలమైన ఆర్థిక వ్యవస్థను అప్పగించిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని అన్నారు. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు పార్లమెంటుకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.