: అర్ధరాత్రి చిరుతిళ్ళకు గుడ్ బై చెప్పండి!


ఎదురుగా తినుబండారం ఏదైనా కనపడితే చాలు... కొంతమంది ఆగలేరు. వెంటనే నోట్లో వేసుకుని లాగించేస్తారు. ఇలా చిరుతిళ్ళు తినే వాళ్లకి వేళాపాళా కూడా వుండదు. నిద్రలో లేచి కూడా తినేస్తుంటారు. అయితే, ఈ చిరుతిళ్ళు ఎప్పుడు తిన్నా ఒంటికి అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా అర్ధరాత్రి పూట తినే చిరుతిళ్ళు అసలే మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇలా అర్ధరాత్రి తినడం వల్ల బరువు బాగా పెరిగిపోతారట. ఆ సమయంలో తినడం వల్ల ఒంట్లో కొవ్వు బాగా పెరిగి రోగాల బారిన పడుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. నైట్ డ్యూటీలు చేసే ఉద్యోగులు ఇలా అర్ధరాత్రి పూట చిరుతిళ్ళకు బాగా అలవాటు పడతారు.

అందుకే, వాళ్లల్లో మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి వ్యాధులు తలెత్తుతున్నాయట. ఏమైనా, ఉదయం పూట తినే చిరుతిళ్ళ కన్నా అర్ధరాత్రి పూట తినే వాటి వల్లే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయని ఆ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి, నైట్ డ్యూటీ చేసే ఉద్యోగులు వాటికి దూరంగా వుంటే మంచిది!           

  • Loading...

More Telugu News