: జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటన్ విడుదల
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు హెల్త్ బులెటన్ విడుదల చేశారు. జగన్ ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతున్నట్టు, ఇంకా ప్లూయిడ్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పారు. పూర్తిగా కోలుకునేందుకు మరో రెండు రోజుల వరకు విశ్రాంతి అవసరమని తెలియజేశారు.