: ధరలపై అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం: సీపీఎం మధు
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది.పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన ధరలను తక్షణం ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్. వీరయ్య డిమాండ్ చేశారు. ధరలను తగ్గించకపోతే అన్ని రాజకీయ పార్టీలతో ఐక్యఉద్యమాన్ని నిర్మిస్తామని సీపీఎం పార్టీ నేత మధు స్పష్టం చేశారు. అసమర్థ విధానాలతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.