: ఆశారాం బాపు జోథ్ పూర్ తరలింపు
వివాదాస్పద ఆథ్యాత్మిక మత గురువు ఆశారాం బాపును పోలీసులు జోథ్ పూర్ తరలించారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాంను శనివారం ఆర్థరాత్రి ఇండోర్ లోనే ఆయన ఆశ్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విమానంలో జోథ్ పూర్ తరలించారు. 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేసినట్టు సదరు బాలిక ఫిర్యాదు చేయగా, ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆశారాం బాపు దేవుడని అతనికే పాపం తెలియదని అంటున్నారు. పలు మహిళా సంఘాలు మాత్రం ఆశారాం బాపును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే ఆశారాం బాపు తప్పు చేసి ఉంటాడని వారు నిర్థారణకు వస్తున్నారు.