: పెట్రోలు ధరలను తగ్గించాల్సిందే: సీపీఐ
పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ వరంగల్ లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తంతి తపాల కూడలి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలవల్లే ధరలు పెరిగాయని, అందుకే ప్రస్తుత ధరలపై బాధ్యత తీసుకుని, పెంచిన ధరలను ఉపసంహరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.