: గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేస్తా: మంత్రి గంటా


గవర్నర్ నరసింహన్ ను రేపు స్వయంగా కలిసి రాజీనామా లేఖ అందజేయనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై మనస్తాపంతో, సమైక్యాంధ్రకు మద్దతుగా తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని అన్నారు. విభజన నిర్ణయం తరువాత గంటా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలకు ఆదరణ లభించడం లేదు. అలాగని అధిష్ఠానం కూడా నేతల వాదనలను వినే అవకాశం కన్పించడం లేదు. దీంతో గంటా రాజీనామాకు మొగ్గు చూపుతున్నారు. మంత్రి గంటాతో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా బాట పట్టనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News