: 'తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర' కు బయలుదేరిన చంద్రబాబు


తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి సీమాంధ్రలో 'తెలుగుజాతి ఆత్మ గౌరవ యాత్ర' చేయనున్నారు. ఈ యాత్ర గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల నుంచి ప్రారంభమవుతుంది. తొలివిడత యాత్రలో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. తన యాత్రకు సంబంధించిన తొలి 5 రోజుల షెడ్యూలు ఖరారైంది. అందుకు గాను చంద్రబాబు ఈ ఉదయం తొలుత ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి, ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి అక్కడ్నించి రోడ్డు మార్గంలో 'పొందుగుల'కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభించి శ్రీనగర్, గామాలపాడు, నడికుడి, దాచేపల్లి, పిఠాపురం, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ళ వరకు మొత్తం ఈ రోజు 35 కిలోమీటర్ల మేర యాత్ర చేస్తారు.

  • Loading...

More Telugu News