: ఆశారాం బాపుని అరెస్ట్ చేసిన పోలీసులు
ఆశారాం బాపుని శనివారం అర్ధరాత్రి జోధ్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఇండోర్ లోని ఆశ్రమంలో వుండగా ఈ అరెస్ట్ జరిగింది. అనంతరం ఆశ్రమం నుంచి ఇండోర్ విమానాశ్రయానికి ఆయనను తీసుకొచ్చారు. ఈ ఉదయం విమానంలో జోధ్ పూర్ తరలించి విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆశారాం బాపుతో పాటు మొత్తం 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.