: మన ఆలోచనల్ని 'ప్రసారం' చేయవచ్చు


పూర్వకాలం టెలిపతి అనే ఒక శక్తి ఉన్నట్టుగా మాండ్రేక్‌ మహేంద్రజాలం కథల్లో ఉండేది. అంటే.. అచ్చంగా ఆలోచనలకు సంబంధించినంత వరకు పరకాయ ప్రవేశం లాంటి దన్నమాట. ఇక్కడ మనం ఒక ఆలోచన చేస్తూ ఆ ఆలోచన మరో దేశంలోని, ఫలానా వ్యక్తికి చేరవలెనని అనుకుంటే.. అది వారికి చేరిపోతుంది. దానిని టెలిపతి అంటారు. ఇప్పుడు దాదాపుగా అలాంటి పనినే ఇంటర్నెట్‌ ద్వారా సాధించే ప్రక్రియను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక మనిషి మెదడు ఇంటర్నెట్‌ ద్వారా మరో మనిషి మెదడుపై నియంత్రణ సాధించే ప్రయోగాన్ని సఫలం చేయడంలో ఓ భారతీయ శాస్త్రవేత్త కూడా పనిచేయడం విశేషం.

భారత సంతతికి చెందిన వాషింగ్టన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ రాజేశ్‌రావు ఇంటర్నెట్‌ ద్వారా తన మెదడులోని సంకేతాన్ని తన సహ శాస్త్రవేత్త ఆండ్రియా స్టోకోకు పంపారు. సంకేతం అందుకున్న స్టోకో మెదడు పురమాయింపు మేరకు అతని వేళ్లు.. ఆ ఆదేశాలకు అనుగుణగా కదిలాయి. అద్భుతం అనదగిన రీతిలో సమాచారం ప్రసారం జరిగినట్లు అయింది. నిజానికి డ్యూక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఒక మనిషి నుంచి ఒక ఎలుక మెదడుకు సంకేతాలు పంపగలిగారు. అయితే ఒక మనిషి నుంచి మరో మనిషి మెదడుకు ఇంటర్నెట్‌ ద్వారా పంపడం అనేది ఇదే ప్రథమమట.

  • Loading...

More Telugu News