: పదవులకు రాజీనామా చేసి నేతలు ఉద్యమంలో పాల్గొనాలి: న్యాయవాదులు


రాజకీయ పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర న్యాయవాదుల సదస్సు తీర్మానించింది. ఈ సాయంత్రం గుంటూరులోని ఎన్జీవో హోంలో సమైక్యాంధ్ర న్యాయవాదుల సదస్సు జరిగింది. సీమాంధ్రకు చెందిన 13 జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయశాఖ సిబ్బంది ఈ సదస్సుకు హాజరయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ సెప్టెంబర్ 15 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో న్యాయవాదులపై జరిగిన దాడుల్ని ఖండించారు. సీఎం జోక్యం చేసుకుని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 2 నుంచి 15 వరకు పోరాట ప్రణాళికను సదస్సులో ప్రకటించారు. 14వ తేదీన అనంతపురంలో సీమాంధ్ర సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News