: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యధావిధిగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై రూ.2.35 పైసలు, లీటరు డీజిల్ పై 50 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. ఈ ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచాలని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ మధ్యాహ్నమే ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి చర్చించారు.