: సెప్టెంబర్ 12న కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు: బలరాం నాయక్
సెప్టెంబర్ 12న కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్రమంత్రి బలరాం నాయక్ తెలిపారు. రాష్ట్ర విభజన ఎప్పుడో జరిగిపోయిందని అన్నారు. హైదరాబాద్ లో ఎవరైనా ఉండొచ్చని, సీమాంధ్రులను ఎవరైనా వెళ్లమంటే వారిని వ్యతిరేకించి సీమాంధ్రులకు అండగా ఉంటామన్నారు. సీమాంధ్రులకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. ఇరుప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మంత్రి సూచించారు.