: జగన్ దీక్ష భగ్నంపై వైఎస్ భారతి స్పందన
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ తల పెట్టిన దీక్ష భగ్నమయినట్టేనని ఆయన భార్య భారతి చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ, కోర్టు ఆదేశాలు చూపించి వైద్యులు బలవంతంగా జగన్ ఆమరణ దీక్షను భగ్నం చేశారని ఆమె తెలిపారు. తన ముందే మూడు సెలైన్ బాటిళ్లు ఎక్కించారని చెప్పారు. బిపి, షుగర్ లెవల్స్, పల్స్ రేటు పడిపోవడంతో జగన్ ఆరోగ్యం విషయంలో నిన్న, ఈ మధ్యాహ్నం తాము చాలా భయపడ్డామన్నారు. జగన్ కు అందిన వైద్యసేవలపై ఆమె సంతృప్తి వ్యక్తంచేశారు. జగన్ ను ఆసుపత్రిలో కలిసిన సందర్భంగా రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాల గురించి తానేమీ మాట్లాడలేదని వైఎస్ భారతి పేర్కొన్నారు.