: ఓటింగ్ పెడితే సమైక్యాంధ్రకే ఓటేస్తా: జగ్గారెడ్డి
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై విప్ జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మెదక్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను పక్కా సమైక్యవాదినని చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై ఓటింగ్ పెడితే సమైక్యాంధ్రకే ఓటేస్తానని స్పష్టం చేశారు. ఇక, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యాయం ముగుస్తుందని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ నేతలెవరైనా మిగిలుంటే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్.. కాంగ్రెస్ లో విలీనమైనా, పొత్తుపెట్టుకున్నా ఆ పార్టీ నేతలు రోడ్డునపడడం ఖాయమని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఎన్ని పదవులిచ్చినా సరిపోవని చెప్పారు.