: ఎల్లుండి నుంచి నేతల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత


సమైక్యాంధ్రకు మద్దతుగా ఎల్లుండి నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో సీమాంధ్ర జిల్లాల విద్యుత్ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఉద్యమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన జేఏసీ కార్యవర్గం సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సేవలు నిలిపివేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. విద్యుత్ సౌధలో ఇంజినీర్లపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ సాధించేవరకు పోరాటం సాగిస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News