: హెచ్ పీసీఎల్ ఘటనలో 19కి చేరిన మృతుల సంఖ్య


విశాఖ హెచ్ పీసీఎల్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విశాఖపట్నంలోని న్యూకేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ కుమార్(20) మృతి చెందాడు. దీంతో వీరి సంఖ్య 19 కి చేరింది. ఇదే ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో మరో 16 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ మరో 8 మందిని ముంబైకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 23 న జరిగిన విశాఖ హెచ్ పీసీఎల్ రిఫైనరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News