: బ్యాటు పట్టిన పెద్దన్న


గత మూడు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్ళీ ప్రాక్టీసు మొదలుపెట్టాడు. ఐపీఎల్-6 సందర్బంగా సచిన్ మోచేతికి గాయం కావడంతో లండన్ లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకున్న సచిన్ చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ కోసం బ్యాటు పట్టాడు. మే 13న సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా 38 పరుగులు చేసిన అనంతరం సచిన్ రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ తర్వాత ముంబయి ఇండియన్స్ ఆడిన ఐదు మ్యాచ్ లకు సచిన్ దూరంగానే ఉన్నాడు.

కాగా, ఐపీఎల్-6 టోర్నీలో ముంబయి ఇండియన్స్ టైటిల్ గెలవడంతో విజేత హోదాలో ఆ జట్టు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధించింది. టెస్టులాడే దేశాల్లో నిర్వహించే టీ20 టోర్నీల్లో విజేతలతో పాటు రన్నరప్ జట్లకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే, ఐపీఎల్ నుంచి మూడు జట్లు ఈ టోర్నీలో పాల్గొనే వెసులుబాటు ఉంది. ముంబయితోపాటు ఐపీఎల్-6 రన్నరప్, మూడోస్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ రసవత్తర ఈవెంట్ సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6 వరకు భారత్ లోనే జరగనుంది.

  • Loading...

More Telugu News