: పోటాపోటీ నిరసనలను విరమించిన సచివాలయ ఉద్యోగులు


సచివాలయంలోని సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులతో పోలీసులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రెండు వేర్వేరు మార్గాల ద్వారా ఉద్యోగులు ర్యాలీ చేస్తున్నారు. పోలీసులు చేసిన సూచనల మేరకు ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు విరమించారు. ఈ ఉదయం రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు నిరసనలు, నినాదాలతో సచివాలయాన్ని హోరెత్తించారు. సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ర్యాలీకి పోటీగా తెలంగాణ ఉద్యోగులు వారికి ఎదురుగా రావడంతో రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో తోపులాట కూడా జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపజేసి చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News