: భారీగా తగ్గిన శ్రీవారి ఆదాయం!


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఉద్యమం తిరుమల శ్రీవెంకటేశ్వరుడి ఆదాయంపై ప్రభావం చూపింది. దాంతో, శ్రీవారి రోజువారీ ఆదాయం భారీగా తగ్గింది. ఉద్యమం నేపథ్యంలో భక్తులు లేక తిరుమల వెలవెలబోతోంది. అంతకుముందువరకు భక్తులు వేసిన కానుకలు, విరాళాల ద్వారా ప్రతిరోజు సుమారు కోటి నుంచి కోటి 6 లక్షల రూపాయలవరకు ఆదాయం వచ్చేదని టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత ఉద్యమ సెగతో వెంకన్న రాబడి రూ.60 లక్షల నుంచి కోటి మధ్య కూడా లేదని చెప్పారు. దాంతో, వారం చివరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని వివరించారు.

అప్పడప్పుడు కొంతమంది భక్తులు స్వామివారికి బంగారం, వెండి వంటి విలువైన కానుకలు కూడా సమర్పించుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అవీ లేవు. రోజువారి బంద్, రెండు రోజుల తిరుపతి అష్టదిగ్బంధనంతో ఈ ఆదాయం ఇంకా కనిష్ఠస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అటు ఆర్టీసీ బంద్ తో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 60వేల నుంచి 40వేలకు పడిపోయింది. ఇక, సామూహిక సెలవు పేరుతో సమైక్యాంధ్రకు మద్దతుగా నిన్న టీటీడీ ఉద్యోగులందరూ 'సద్భావన ర్యాలీ' నిర్వహించారు.

  • Loading...

More Telugu News