: సిటీలైట్ హోటల్ యజమాని అరెస్టు
గతనెల ఎనిమిదో తేదీన హైదరాబాదులో సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో యజమాని హసన్ అలీని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. గాయపడినవారిలో హోటల్ యజమాని కూడా ఉన్నారు. నెలరోజులపైగా చికిత్స అనంతరం నిన్ననే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.