: సచివాలయం వద్ద భారీ బందోబస్తు
సచివాలయంలో ఉద్యోగుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇరుప్రాంతాల ఉద్యోగులు నినాదాలతో సచివాలయాన్ని హోరెత్తించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.