: భారత్, థాయ్ లాండ్ మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలు


భారత్, థాయ్ లాండ్ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలు బలంగా ఉన్నాయని భారత్ లో థాయ్ లాండ్ హైకమిషనర్ పిసాన్ మానవపట్ తెలిపారు. విశాఖలో ఎల్వీప్రసాద్ ఇన్స్టిట్యూట్ ను పిసాన్ సందర్శించిన అనంతరం భవిష్యత్తులో భారత్, థాయ్ లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు బలపడనున్నాయని అన్నారు. విశాఖ నుంచి బ్యాంకాక్ కు విమాన సర్వీసులు నడిపే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ పేదలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. అనంతరం ఇన్స్టిట్యూట్ లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్వీప్రసాద్ సంస్థ వృద్ధులకు అందజేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News